బాబు, పవన్‌.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్‌ లేదా?: వరుదు కళ్యాణి

Published on Wed, 07/17/2024 - 16:39

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవార​ం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభాంత్రులకు గురవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. నిన్న కేబినెట్‌ సమావేశంలో ఈ ఘటనలపై ఎందుకు చర్చించలేదు.

రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.హోం మంత్రి అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబాలను పరామర్శించడంపై లేదు. హోం మంత్రి చర్యలు దారుణంగా ఉన్నాయి. బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న ఈ ప్రభుత్వం ఆ బుల్డోజర్లను ఆకాతాయిలపై ప్రయోగించాలి. దిశ చట్టంతో మహిళలకు వైఎస​్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రక్షణ కల్పించారు. 2700 మంది మహిళలను దిశ యాప్ రక్షించింది. దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదని హోం మంత్రి పదే పదే చెప్పారు. అందుకే దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ‘దిశ’ అనే ఆయుధాన్ని ఆక్టివ్ చెయ్యండి.

కేంద్రంలో ‘దిశ’ చట్టం పెండింగ్‌లో ఉంది. చట్టం అమలులోకి వచ్చేలా చూడాలి. కూటమిలో ఉన్న మీరు దిశ చట్టంపై బాధ్యత తీసుకోవాలి. దర్శిని కుటుంబానికి కనీసం ఆర్ధిక సహాయం కూడా ప్రకటించలేదు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. హోం మంత్రి పక్క నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరిగితే ఆమెకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి లేదంటే వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పని చెయ్యాలి. దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలి’ అంటూ హితవు పలికారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)