Breaking News

చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే: మార్గాని భరత్‌

Published on Tue, 10/01/2024 - 11:54

సాక్షి, తూర్పుగోదావరి: హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది? అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వైఎస్‌ జగన్ ఏయే అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చివరకు సత్యమే గెలుస్తుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే  పారదర్శకత ఏముంటుంది. హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పోలవరానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీ పూర్తి వివరాలు పీపీఏ, సీడబ్ల్యూసీకి నివేదిక అందించింది. 

నూతన డయాఫ్రం వాల్ నిర్మించాలి. డయాఫ్రం వాల్ చిన్నాభిన్నం అయిపోవడానికి చంద్రబాబు కారణం కాదా?. నదిని డైవర్ట్ చేయడానికి మొదట అప్రోచ్ ఛానల్ కట్టాలి స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి. 2016 డిసెంబర్‌లో డయాఫ్రం వాల్ ప్రారంభించారు. 2018 నాటికి కాఫర్‌ డ్యామ్ పూర్తయింది. ఈసీఆర్‌ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ అయిన డయాఫ్రం వాల్‌కు రక్షణ లేకపోవడంతో దెబ్బతింది. ఏ రకమైన రక్షణ లేకపోవడం వల్ల కాఫర్ డ్యాం నిర్మాణం దెబ్బ తిందని కమిటీ తేల్చింది. దీనంతటికీ కారణం చంద్రబాబు కాదా?.  

డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు కనిపించకపోతే, యథావిధిగా ఈసీఆర్‌ఎఫ్ పూర్తి చేసేస్తే భవిష్యత్తులో ఎటువంటి అనర్థం జరిగేది. కాఫర్ డ్యాంలు కట్టకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టారు?. కాంక్రీట్ పనులు పూర్తి చేస్తే కమిషన్ డబ్బులు వస్తాయని ఆశించి చంద్రబాబు ముందు ఈ పనులు చేపట్టారు. కాపర్ డ్యామ్ కింద 40 మీటర్ల మేర జెట్ గ్రౌటింగ్ జరగాలి. చంద్రబాబును పోలవరం ద్రోహి అని పిలవాలి. పోలవరానికి చేటు చేసిన వ్యక్తిని తెలుగు ప్రజల ద్రోహి అని ఎందుకు అనకూడదు?. రాష్ట్రానికి ఇంత అనర్ధం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. పోలవరానికి సంబంధించి చంద్రబాబు చేయని తప్పంటూ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: తిరుపతి లడ్డూ వివాదం: దర్యాప్తు నిలిపివేసిన సిట్‌
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)