Breaking News

పోస్టల్‌ బ్యాలెట్లపై వైఎస్సార్‌సీపీ పిటిషన్‌.. తోసిపుచ్చిన సుప్రీం

Published on Mon, 06/03/2024 - 09:20

న్యూఢిల్లీ, సాక్షి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ విషయంలో ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటానికి దిగింది. అయితే వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం జోక్యం చేసుకోలేమని చెప్పింది. 

ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ఇచ్చిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. రేపు ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన పిటిషన్‌ ద్వారా అభ్యర్థించారు. అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి  పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను.. తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ వేసింది వైఎస్సార్‌సీపీ. 

రేపే కౌంటింగ్‌ కావడంతో.. నేడు త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం ముందు మెన్షన్  చేశారు. అలాగే.. దేశం అంతటా ఎన్నికల సంఘం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వాదించారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ వరకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, ఈ తరుణంలో తాము ఈసీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది.

హైకోర్టులో..
ఇక వైఎస్సార్‌సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పోస్టల్‌బ్యాలెట్‌ ఈసీ మెమోపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అదే సమయంలో ఏపీ సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం, మెమోలో కొంత పార్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడింది. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ బలమైన వాదనలే వినిపించింది. రాత్రికి రాత్రే మెమో తేవాల్సిన అవసరం ఏముందని, దేశంలో ఎక్కడా లేని రూల్‌ను ఏపీలో తీసుకురావడంలో ఆంతర్యమేంటని వాదించింది. 

కానీ, పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. దీంతో వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనివార్యమైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)