Breaking News

‘ఎన్నికల కమిషన్‌కు కళ్లు లేవా?.. ఎంపీటీసీలపై దాడులేంటి?’

Published on Mon, 01/05/2026 - 15:22

సాక్షి, తాడేపల్లి/ నెల్లూరు: వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు వైఎస్సార్‌సీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామం లేదు.. ఉప ఎన్నికల్లో సైతం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ కళ్లు ఉండి.. గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు.

వింజమూరు, బొమ్మనహళ్లి ఎన్నికలపై వైఎస్సార​్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ..‘వింజమూరు, బొమ్మనహళ్లిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలాంటి అప్రజాస్వామ్యమైన పనులు చేయలేదు. ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఎన్నికల కమిషన్ గుడ్డిగా వ్యవహరిస్తోంది. మా పార్టీ ఎంపీటీసీ సభ్యులను పోలీసుల ఎదుటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మహిళా ఎంపీటీసీపై దాడి చేయటంతో చేతికి గాయమైంది. అధికారులు పద్దతులు మార్చుకోవాలి. టీడీపీ గూండాలకు మద్దతుగా వ్యహరించిన వారందరి పేర్లనూ మా డిజిటల్ బుక్‌లో ఎక్కిస్తాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

మరోవైపు.. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై అతి దారుణంగా దాడి చేశారు. మహిళా ఎంపీటీసీకి గాయలయ్యాయి. సంఖ్యా బలం కోసం నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. నైతికంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో  ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేయడానికి యత్నించడంతో కలకలం రేగింది. ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును టీడీపీ వర్గీయులు అ‍డ్డుకున్నారు. అనంతరం, ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. అంతేకాకుండగా మల్లికార్జున్ అనే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్‌ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం అయిన ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల జులం ప్రదర్శించారు. దాంతో స్థానికంగా  ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Nellore: ఎంపీటీసీల ఓటు వేసే హక్కును కాలరాసిన కూటమి ప్రభుత్వం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)