Breaking News

‘కూటమిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’

Published on Fri, 01/23/2026 - 21:12

సాక్షి, ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా భయపడరని వైఎస్సార్‌సీపీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఎంత  ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా  బయటకి వచ్చారని చెప్పుకొచ్చారు.

జైలు నుంచి విడుదలైన జోగి రమేష్‌ను ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కలిశారు. అనంతరం దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ..‘కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు.83 రోజులు జోగి రమేష్‌, అతని సోదరుడిని జైలు పెట్టారు. జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పం. కోర్ట్ కూడా నమ్మింది బెయిల్ ఇచ్చింది. 

కూటమి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన కూటమి అన్యాయాన్ని జోగి ప్రశ్నిస్తున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినా ఎవరిని బయపెట్టలేరు. అరెస్టులకు ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త భయపడరు. వైఎస్‌ జగన్ నాయకత్వంలో మరింత చురుగ్గా పాల్గొంటారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కక్ష పూరితంగా కేసులు పెట్టారు. వ్యక్తుల మీదనే కాకుండా కుటుంబంపైన కేసులు పెడుతున్నారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మాట్లాడుతూ..‘చేయని తప్పులకు 83 రోజులు జోగి రమేష్‌ను జైలులో పెట్టారు. జైలులో పెట్టడం తప్ప కూటమి నేతలు ఏమీ చేయలేరు. కూటమి చర్యలు చూసి ఆంధ్రప్రదేశ్ అంతా నవ్వుతుంది. జోగి రమేష్ మీదనే కాదు.. కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు నాటిన విత్తనం రేపు చెట్టు అవుతుంది. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై 2029లో చట్టబద్దంగా చర్యలు తీసుకుంటాం. జోగి రమేష్ ఎంత  ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా  బయటకి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో జోగి రమేష్ కూటమి పాలనపై పోరాటం చేస్తారు అని తెలిపారు. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు