ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్‌

Published on Sun, 08/02/2026 - 07:56

అప్‌డేట్స్‌:

విరూపాక్షికి రిమాండ్‌

  • ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్‌

  • విరూపాక్షితో పాటు 17 మందికి రిమాండ్‌ విధింపు 

  • రిమాండ్‌ విధించిన ఆలూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు

 307 సెక్షన్‌ కింద కేసు నమోదు

  • ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేసి 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు 

  • విరూపాక్షితో పాటు మరో 34 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు

  • విరూపాక్షిని కోర్టుకు తరలించిన చిప్పగిరి పోలీసులు

  • జడ్జి ముందు ప‍్రవేశపెట్టనున్న పోలీసులు

సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2.45 గంటల సమయంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే నివాసం తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎ. మధుసూధన్‌, బీవై. రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు.

చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి తెగబడితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్లు రువ్వడంతో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, గొడవకు ఎమ్మెల్యేనే కారణమంటూ సీఐ రవిశంకర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.

దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినట్లు పోలీసు బలగాలు వ్యవహరించడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, తలుపులు పగులగొట్టి విరూపాక్షితో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేసి చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ఎమ్మెల్యే నివాసంలోని సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వాస్తవాలను బయటకు రానివ్వకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకే హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిలోని దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా భద్రపరచాలని, ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుబంధ విభాగంలా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బెదిరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ అరెస్టు చేయాలని, సీఐ రవిశంకర్‌రెడ్డి ఏకపక్ష వ్యవహారశైలిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చిప్పగిరిలో శాంతిభద్రతలను పరిరక్షించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

 

 

 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)