Breaking News

ఇది ప్రజాస్వామ్యంపై దాడి: వైఎస్సార్‌సీపీ

Published on Fri, 08/09/2024 - 12:10

సాక్షి, విజయవాడ: అంబేద్కర్‌ విగ్రహంపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు.. అంబేద్కర్‌ స్మృతివనం దగ్గర నిరసనకు దిగారు. భావితరాలకు  దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్‌ విగ్రహాన్ని వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని.. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం ఉండకూడదనే టీడీపీ నేతలు దాడి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్‌ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. వెంటనే దాడి ఘటనపై విచారణ చేయాలి. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్‌ చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం 
గుంటూరు: గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం వద్ద శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి రాంబాబు
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘‘అంబేద్కర్‌ స్మృతివనంపై దుండగులు దాడి చేశారు. చంద్రబాబు,లోకేష్‌ ప్రమేయంతోనే అంబేద్కర్‌ విగ్రహంపై దాడి జరిగింది. దాడి దురదృష్టకరం. అంబేద్కర్‌ విగ్రహంపై దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు. దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలి’’ అని అంబటి డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతల హస్తం ఉంది: పోతిన మహేష్‌
అంబేద్కర్‌ విగ్రహంపై దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి. దాడిలో టీడీపీ నేతల హస్తం ఉంది. అధికారుల అండదండలతో  దాడి చేశారు వెంటనే ప్రజలకు చంద్రబాబు క్షమాప చెప్పాలి


 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)