Breaking News

కట్టు కథతో‌ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు: బైరెడ్డి సిద్దార్థ

Published on Sat, 09/13/2025 - 13:03

సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు వైఎస్సార్‌సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అక్రమ కేసులో పక్కా ప్లాన్‌ ప్రకారమే మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారని ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు అని చెప్పుకొచ్చారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మూలాఖత్‌లో వైఎస్సార్‌సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైఎ‍స్సార్‌సీపీ నేతలు మేడపాటి షర్మిల రెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు కలిశారు. అనంతరం, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ..‘కట్టు కథతో‌ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు. దేశంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది అని భావించి, అక్రమ కేసులో అరెస్టు చేశారు.  

కూటమి గాలిలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారు. కస్టడీకి ఎందుకు ఇప్పటి వరకు పిలవలేదు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు. కథలు చెప్పి వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు ఒక్కరినైనా తిరిగి తీసుకొచ్చారా?. గత ప్రభుత్వంలో  కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు అన్నారు.. ఒక్క ఆధారమైన ఉందా?.

కల్తీ మద్యంతో ఎంతో మంది ఆసుపత్రి పాలైతే ఒక కేసు అయినా నమోదు చేశారా?. గత ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు ఆధారాలు చెరిపేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం దారుణం. ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు.. టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. వైఎస్‌ జగన్‌ అన్నివేళలా మద్దతుగా ఉన్న వ్యక్తులకు మా మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది. అన్నదాత సుఖీభవ గానీ ఇతర ఏ ప్రభుత్వ పథకం గాని ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయలేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. మిథున్ రెడ్డి ఎంపీ అయినా కేటాయించాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం లేదు. జైల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు.

Byreddy: మీ యాక్షన్ కు మా రియాక్షన్... మీ ఊహకే వదిలేస్తున్నా

మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. సాక్ష్యాలు లేకుండా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీకి మంచి రోజులు వస్తాయి’ అని తెలిపారు. 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)