Breaking News

'స్థానిక ఎన్నికలు' నిష్పాక్షికంగా జరిపించండి

Published on Fri, 08/08/2025 - 04:58

సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ (స్థానిక) ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ వ్యవహారంలో ఇంతకుమించి జోక్యం చేసుకోలేమని పేర్కొంది. 

స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్‌సీపీ సమర్పించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యల నిమిత్తం డీజీపీకి పంపిందని గుర్తుచేసింది. ఈ వ్యాజ్యంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంతటితో పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. 

స్థానిక ఎన్నికల ప్రక్రియలో సీసీ టీవీల ఏర్పాటు, వెబ్‌ క్యాస్టింగ్, స్వతంత్ర పరిశీలకులు, అభ్యర్థులకు పోలీసు రక్షణ, ఎన్నికల ప్రక్రియను వీడియో తీసే విషయంలో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారందరికీ సమాన అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేశారు. 

దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవట్లే.. 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ... స్థానిక ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతిని వివరించారు. అధికార పార్టీ కండబలం, ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతోందని, అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిగే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు. 

పారదర్శకంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్‌ సమర్పించిన వినతిపై స్పందించామని తెలిపారు. వారు కోరిన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఎన్నికల కమిషన్‌ సూచించిందన్నారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని కూడా చెప్పిందన్నారు.

ప్రశాంత ఎన్నికల బాధ్యత అధికారులదే!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌
శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పులివెందుల డీఎస్పీ, పులివెందుల గ్రామీణ సీఐ, పట్టణ సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తదుపరి చర్యల నిమిత్తం ఎన్నికల అధికారి (కలెక్టర్‌), జిల్లా ఎస్పీకి పంపిన విషయాన్ని రికార్డు చేసింది. తమ ముందు దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు.  

ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సెల్‌ ఏర్పాటు చేయాలి 
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా తటస్థంగా వ్యవహరించేలా పులివెందుల పోలీసులను ఆదేశించాలని... ఎన్నికల కమిషన్‌ ఆమోదం లేకుండా ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయొద్దని ఆదేశాలివ్వాలంటూ పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన తుమ్మల హనుమంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

ఎన్నికల నిర్వహణకు తటస్థ అధికారులను వినియోగించేలా ఆదేశాలివ్వడంతో పాటు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులకు విభాగం (సెల్‌) ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్‌కూ వినతిపత్రాలు ఇచ్చామని, ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. వీటిపై జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ విచారణ జరిపారు. 

ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు వివేక్‌ చంద్రశేఖర్, సి.విశ్వనాథ్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపామని.. ఆ మేరకు ప్రొసీడింగ్స్‌ కూడా జారీ అయ్యాయని తెలిపారు. ఈ వివరాలను రికార్డ్‌ చేసిన న్యాయమూర్తి, ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)