కిరణ్‌రాయల్‌ను తొక్కి నార ఎప్పుడు తీస్తారు: శ్యామల

Published on Tue, 02/11/2025 - 18:38

సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి11) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో అన్నా అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్నా అని కేకలు పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

తిరుపతిలో లక్ష్మి అనే మహిళకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యాయని లక్ష్మి గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.ఏపీలో మహిళలు భయంభయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ అన్యాయాలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ఆడపిల్లకు అన్యాయం చేస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు చిలుక పలుకులు పలికారు. తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్‌ జగన్ హయాంలో ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేవారు.

ఈరోజు నేరస్తులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. లక్ష్మిని జైపూర్ పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని మూడు రోజుల ముందే కిరణ్‌రాయల్ ఎలా చెప్పాడు? అసలు ఆ పోలీసులను పిలిపించింది ఎవరు? బాధితులనే అరెస్టు చేయడం ఒక్క ఏపీలోనే జరుగుతోంది. ప్రశ్నించే గొంతులను నులిమేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

అణచి వేయాలని చూస్తే అంతకుఅంతగా ఎదుగుతారని గుర్తుంచుకోండి.పవన్ కళ్యాణ్ సిద్దాంతం ప్రకారం..కిరణ్ రాయల్‌ను తొక్కిపట్టి నార ఎందుకు తీయలేదు? అదేమంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలకు పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించలేక పోతున్నారు. ఆడపిల్లల కన్నీటి చుక్కలకు కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

సినిమా ఫంక్షన్‌లలో కొందరు అనవసర వాగుడు వాగుతున్నారు. వారి వలన సినిమా చచ్చిపోతుంది.సినిమా బతకాలి,దాని ద్వారా వందల కుటుంబాలు బతుకుతున్నాయి.నేను చాలా ఈవెంట్లకు హోస్ట్ చేశాను. కానీ ఎప్పుడూ 23 అనే మాట మాట్లాడలేదు’అని శ్యామల గుర్తుచేశారు.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)