Breaking News

‘ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు సమాధానం చెప్పాలి’

Published on Sat, 08/02/2025 - 20:45

విజయవాడ:   ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 25వ డివిజన్‌లో శనివారం(ఆగస్టు 2) బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ రూ.13 వేలు రైతు భరోసా కింద రైతులకు అందించారు. ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు కేంద్రం ఇచ్చినదాంతో కలిపి ఏడు వేలు మాత్రమే ఇచ్చారు. 

జగన్ ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది రైతులకు కోత పెట్టింది. జగన్  కంటే ఎక్కువ ఇస్తామని కబుర్లు చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)