Breaking News

‘ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్రలు లేవు’

Published on Thu, 08/14/2025 - 15:51

తాడేపల్లి :  కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి గెలుపొందిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అత్యంత దారుణమైన ఎన్నికల కమిషన్‌ను తొలిసారి చూశామని ఆయన మండిపడ్డారు.  ఈరోజు(గురువారం, ఆగస్టు 14వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఏజెంట్లకు , ఓటర్లకు స్వేచ్చలేని పోలింగ్ జరిగింది ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. పులివెందులకు ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఎల్లోమీడియా చెప్తోంది. ఆఫీసుల్లో కూర్చుని మాట్లాడటం కాదు, జనంలోకి వచ్చి మాట్లాడాలి. 

ఎన్నికల కమిషన్‌, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళం సృష్టించారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా?, వైఎస్సార్‌సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా?, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకోవటం కూడా గెలుపేనా?, ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదులు చేశాం. 17 సార్లు మేమే స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేశాం. 18 ఈమెయిల్స్ కూడా చేశాం. అయినా  ఎన్నికల కమిషన్‌ ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కమీషనర్ శేషన్ లాగా స్వతంత్రంగా పని చేయమని కూడా చెప్పాం.

హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్‌లో మార్పు లేదు. ఓటర్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ కూడా ఓటు వేయలేక పోయారు. ఇదేనా ప్రజాస్వామ్యం?, పోలింగ్ లో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఇప్పటికీ టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదు. జమ్మలమడుగు, కమలాపురం నుండి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్ ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్‌ ప్రజల ముందు దోషిగా నిలపడింది. ఎన్నికల కమిషన్‌ వైఖరిపై మేము ధర్నా చేయాల్సి వచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలి. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పష​ం చేశారు. 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)