Breaking News

సాల్మన్‌ను పథకం ప్రకారమే హత్య చేశారు: కాసు మహేష్‌రెడ్డి

Published on Thu, 01/15/2026 - 20:58

సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారని వైఎస్సార్‌సీపీ నేత కాసు మ‌హేష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెల్లి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని.. గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు భయంతో బయటికి వెళ్లిపోయాయని కాసు మహేష్‌రెడ్డి అన్నారు.

‘‘సాల్మన్ కూడా భద్రత లేక గ్రామాన్ని వదిలి బయట జీవనం సాగిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెతో మాట్లాడేందుకు సాల్మన్ పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు. అతను గ్రామానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బదులు, కోమాలో ఉన్న సాల్మన్‌పైనే కేసులు పెట్టడం ఎంత దారుణం? సాల్మన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినా సీఐ పనికిమాలిన సెక్షన్లు మాత్రమే పెట్టారు.

..రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రబాబు, లోకేష్ నీతులు చెప్పడం కాదు. పిన్నెల్లి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయిన 1500 మంది పరిస్థితిపై సమాధానం చెప్పాలి. ఈ హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)