Breaking News

అప్పుడేం జరిగిందో గుర్తులేదా?: కాసు మహేష్‌రెడ్డి

Published on Sun, 05/18/2025 - 14:56

సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబట్టారు.

‘‘ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టిపోయింది. వైఎస్సార్‌సీపీ గ్రాఫ్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు’’ అని మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వైఎస్‌ జగన్‌ని కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచింది. 40 శాతం ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్‌ జగన్‌ను అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయింది. ఏపీలో కాంగ్రెస్‌ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. రేపు కూటమి పరిస్థితి కూడా అంతే. ఇవాళ మాకు పాఠాలు నేర్పుతున్నారు.. రేపు అవి వారికి గుణపాఠాలవుతాయి’’ అని మహేష్‌రెడ్డి చెప్పారు.

మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలపడతాం. ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో  సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కచ్చితంగా కేసులు పెడతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి హెచ్చరించారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)