Breaking News

‘యువతను నమ్మించి దగా చేసిన చంద్రబాబు సర్కార్‌’

Published on Sun, 03/09/2025 - 13:34

సాక్షి, విజయవాడ: ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అవినాష్‌ మండిపడ్డారు.

‘‘జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 12వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కార్యక్రమాలు చేపడతాం’’ అని అవినాష్‌ తెలిపారు.

కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం: స్వామిదాస్‌
మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ‘‘విద్యతోనే సముల మార్పు సాధ్యం.. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్ పిలుపు మేరకు 12వ తేదీన ఫీజు పోరు చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను అమ్ముకొని కార్పొరేట్లకు ఊడిగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోవాలి. సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదు. విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకాలు మాయం చేశారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాలు ఒప్పుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు.

మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారు: మొండితోక జగన్మోహన్‌రావు
మాజీ ఎమ్మెల్యే మొండితోక  జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్‌, జగన్ హయంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారు. చదువు విషయంలో బెంగ పడేవారు కాదు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేది. మెడికల్ కాలేజీలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తప్పులు బయటపడతాయని వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని జగన్మోహన్‌రావు హెచ్చరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)