Breaking News

బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తోంది?: బొత్స

Published on Tue, 08/13/2024 - 05:29

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్‌ కార్యాలయంలో సోమ­వారం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన నామినేషన్‌ దాఖ­లు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 580కి పైగా ఓట్ల బలం ఉందన్నారు.  

వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎవరో బిజినెస్‌మేన్‌ను తెచ్చి టీడీపీ పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతోందని,  రాజకీయాలంటే  ఆ పార్టీకి వ్యాపారంలా ఉందని ధ్వజ­మెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తు­న్నారని ప్రశ్నించారు.  300 ఓట్లకు పైగా తేడా ఉన్న సమయంలోనూ పోటీకి దిగడాన్ని ఎలా చూడాలని బొత్స ప్రశ్నించారు. 

కూటమి గెలుస్తుందని చెప్పేవారు ఈ నెల 14 తర్వాత మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ తనుజారాణి, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌ కుమార్, కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  

బలం లేనప్పుడు అభ్యర్థిని ఎందుకు పెడుతుంది...?

వైఎస్సార్‌సీపీకి పూర్తి బలం : సుబ్బారెడ్డి 
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయి బలం ఉందని.. అయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ విమా­నాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)