Breaking News

‘అబద్ధాల్లో అందరి కంటే పెద్ద.. నిజాల్లో అందరి కంటే చిన్న’

Published on Thu, 03/27/2025 - 17:26

గుంటూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గుంటూరు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం వెళ్ళారని,. చంద్రబాబు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుందని ఆయన అనుకూల పత్రికలు రాసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. 

‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్ పై బురుద జల్లుతున్నారు. 2019లో మళ్లీ మేము అధికారంలోకి వచ్చినట్లయితే 2020- 21లో పోలవరాన్ని పూర్తిచేసే వాళ్ళమని ఆయన చెప్పటం విడ్డూరంగా ఉంది.  

అసలు పోలవరాన్ని సర్వనాశనం చేసింది విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా నడిచాయి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడు.  నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడు. జగన్ పాలనలో పోలవరం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళించారని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. 

పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్ళించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. పోలవరం నిర్మాణ సమయంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ఏంటో తెలుసా?, ముందు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది ఆ డబ్బులను కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. అలాంటప్పుడు నిధులు మళ్ళించడం ఎలా సాధ్యమవుతుంది?,  పోలవరం రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులు తీసుకువచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు మేమే కడతావని ఎందుకు ఒప్పందం చేసుకున్నారు’? అని అంబటి ప్రశించారు.

 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)