Breaking News

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా పార్టీ నేతలతో సమావేశం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు

Published on Wed, 08/21/2024 - 10:22

గుంటూరు, సాక్షి: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

పార్టీ సూచనల మేరకు వైఎస్సార్‌ జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని నియమించారు. అలాగే వైఎస్సార్‌ జిల్లా జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.

వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ సమావేశం జరిగింది. తొలుత వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. రేపు(గురువారం)కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆర్నెలలపాటు సమయం ఇవ్వాలని తొలుత జగన్‌ భావించారు. ఆ తర్వాతే చంద్రబాబు సర్కార్‌ను నిలదీయాలని భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా లోకేష్‌ ప్రొత్సహిస్తూ వస్తున్నారు. 

సూపర్‌ సిక్స్‌ అమలు, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వైఎస్సార్‌సీపీపై ప్రతీకార దాడులు, అంతటా నేతల అధికార జులుం, వివిధ విభాగాలు.. వాటి అధిపతులు ఆఖరికి క్షేత్ర స్థాయి ఉద్యోగులపైనా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంపై తక్షణ పోరును ప్రారంభించారు జగన్‌. మరోపక్క.. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో  రెండ్రోజులపాటు(ఇవాళ, రేపు) పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతుండడం విశేషం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)