Breaking News

జేసీ ప్రభాకర్‌కు కేతిరెడ్డి సవాల్‌

Published on Thu, 01/08/2026 - 14:47

సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్‌ విసిరారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి ఎయిమ్స్‌, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రజల కోసం ఆలోచిస్తే రాయలసీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబును నిలదీయాలి కదా? అని కామెంట్స్‌ చేశారు.

తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘జేసీ ప్రభాకర్ రెడ్డి.. మా కుటుంబంపై విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయకుండా అడ్డుపడ్డారు. అనంతపురం జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డారు.  కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా మొకాలడ్డారు.

జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి ఇవన్నీ తీసుకురాగలరా?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీమకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పలేదు?. మీలో సీమ పౌరుషం ఉంటే చంద్రబాబును నిలదీయాలి కదా?. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి బతుకేంటో అందరికీ తెలుసు. నాపై పిచ్చికూతలు కూయడం కాదు.. అభివృద్ధి చేసి చూపెట్టండి. అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై సీఎం రేవంత్‌ చర్చించారు. మీకు చేతనైతే రేవంత్‌ రెడ్డితో మాట్లాడండి. రాయలసీమ టీడీపీ నాయకులకు పౌరుషం చచ్చిపోయింది. దివాకర్‌ రెడ్డి రాజకీయాల్లో ఉంటే దీనిపై కచ్చితంగా స్పందించేవారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

మీలో సీమ పౌరుషం ఉంటే... జేసీ పై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)