Breaking News

‘ప్రజలను వేధించడానికే.. కూటమి అధికారంలోకి వచ్చింది’

Published on Sun, 09/28/2025 - 13:34

సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు అని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులను నేర్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాకినాడ రూరల్‌లో వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల రిజినల్  కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమికి అధికారం  వచ్చింది ప్రజల్ని పీడించడానికి.. వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికే. సామాన్యుల నుండి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు. పోలీసులు ఎందుకు దిగజారిపోయి పని చేస్తున్నారని సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అని చెప్పాలి. అలా కాకుండా.. ప్రజల్ని పీడించుకుని, వేధించుకుని తిను అని చంద్రబాబు తన కొడుక్కి నేర్పించాడు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సంక్షేమం  ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పకుండా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)