Breaking News

అరెస్ట్‌పై ప్రశ్నిస్తే కేసులా?.. ఎవర్నీ వదలేది లేదు: కాకాణి హెచ్చరిక

Published on Sat, 01/04/2025 - 12:18

సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసులే(AP Police) నేరస్థులుగా మారుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘జిల్లాలో పోలీసులే నేరస్థులుగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. తనకు సంబంధం లేనట్టు.. జిల్లాకి తాను ఎస్పీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు చేర్చారు. నేరస్థులను వదిలి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. దీనికి వెంకట శేషయ్య వ్యవహారమే ఉదాహరణ.

శేషయ్య అరెస్ట్ వ్యవహారంలో పోలీస్ వ్యవస్థ న్యాయవ్యవస్థను తప్పుదారిలోకి మళ్లించింది. శేషయ్య కేసులో ఎంత ఉప్పు తిన్నారో.. అన్ని నీళ్లు తాగిస్తా.. పోలీసులకు, కూటమి నాయకులకు ఇదే నా హెచ్చరిక. ఈ కేసులో జరిగిన తప్పిదాలను సమాజం ముందు ఉంచుతాం. జిల్లా అధికారులు ఈ కేసులో న్యాయం చేస్తారని మేము భావించడం లేదు. కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఎస్పీ విచారణకు ఆదేశించాలి.  నా కళ్ల ముందు జరిగిన వ్యవహారం ఇది. ఇందులో ఎవరినీ వదలం పెట్టేది లేదు. కోవూరులో  కొత్త స్టాంపులకు పాత తేదీలు వేశారు. తప్పు చేసిన వారు ఎక్కడున్నా వదలిపెట్టం. శేషయ్య కేసులో జరిగిన లోపాలపై పూర్తి ఆధారాలతో హైకోర్టులోనూ ఫైల్ చేస్తాం. ఇక్కడ పోలీసులపై ప్రైవేట్ కేసు కూడా వేస్తాం అని హెచ్చరించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)