Breaking News

‘సంక్రాంతికి వెరైటీ దోపిడీ.. కూటమి సూపర్‌ ఫైవ్‌ ఇవేనా?’

Published on Fri, 01/17/2025 - 11:08

సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja). ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్‌, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు.

రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబు(Chandrababu), పవన్‌(Pawan Kalyan) ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. సంక్రాంతి(sankranthi) సంబరాలు అంటే గంగిరెద్దులు ముగ్గులు, అక్కడక్కడ కోడిపందాలు మాత్రమే గతంలో ఉండేవి. సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చారు కూటమి నేతలు.. నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయి.

ఒక్కో మహిళకు నెలకు 15వేలు చొప్పున ఆర్థిక సాయం అన్నారు.. సూపర్ సిక్స్ మేనిఫెస్టో దేవుడి పేరిట అటకెక్కింది. పేకాట, గుండాట.. కోడిపందాలు.. రికార్డింగ్ డ్యాన్స్‌.. మద్యం అమ్మకాలు.. ఇవే కూటమి మేనిఫెస్టో. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చూసినట్టు కోడి పందాలను, ప్రీమియర్ లీగ్‌లా నిర్వహించి పార్కింగ్ పేరిట సామాన్యుడి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు. రాజానగరం నియోజకవర్గంలో భూపాలపట్నంలో డ్రగ్స్.. రేవ్ పార్టీలు.. రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి తీసుకొచ్చారు. అనకాపల్లిలో గంజాయి దొరికితే.. అందులో రాజానగరం నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన జనసేన నేతలు మూలాలు ఉన్నాయి.

గంగాధర్ అనే వ్యక్తి గుండాటలో డబ్బులు పోయాయని ఆత్మహత్య చేసుకున్నాడు. బహిరంగంగా పోలీసులను కూడా వేదికలపై నుండి బయటకి గెంటేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గాల్సి వచ్చింది. కొన్నిచోట్ల సంక్రాంతికి అసలు పోలీసులు ఉన్నారా లేరా అనే ప్రశ్న తలెత్తింది. రాజమండ్రి పేపర్ మిల్‌పై వేలమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి చేస్తున్నాడు. ప్రవీణ్ చౌదరికి తెలుగుదేశంలో మూలాలు ఉన్నాయి.. బుచ్చయ్య చౌదరి అడుగుజాడల్లో నడుస్తాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)