Breaking News

బాబు సీఎం.. రైతులకు ఇబ్బందులు, కష్టాలు: గడికోట

Published on Mon, 11/24/2025 - 12:12

సాక్షి, అన్నమయ్య జిల్లా: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి.. కానీ, కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు రాష్ట్రంలో చాలా మేర పంటలు సాగు చేయనే లేదు. అన్నమయ్య జిల్లాలో కనీసం పది శాతం కూడా పంటల సాగు జరగలేదు. మామిడి రైతులకు చంద్రబాబు డబ్బు ఇచ్చాను అంటాడు.. కానీ ఎవరికిచ్చాడో చెప్పడు. సాగు చేసిన ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. 20వేలు ఒకే సారి ఇస్తానన్నాడు.. అదీ విడుతల వారీగా ఇస్తున్నాడు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం రైతు బాగుకోసం చూడటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతవరకూ ఒక్క ఎకరాకు కూడా ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇవ్వలేకపోయాడు. గతంలో వైఎస్‌ జగన్‌ బీమా ప్రీమియం కూడా చెల్లించారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో ఇన్‌ పుట్‌ సబ్సిడీ, పరిహారం అందించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

నేడు రాయచోటిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేసేస్తున్నారు. పోలీసులు పూర్తి బాధ్యతా లోపంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల భూములను లాగేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇంకా ఎంతకు దిగజారుస్తారు?. ప్రభుత్వ, ప్రైవేటు అని లేకుండా కనిపించిన ప్రతి ఒక్క భూమినీ కబ్జా చేసేస్తున్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి అసలు మెడికల్‌ కాలేజీలే కట్టలేదంటారు. మదనపల్లి మెడికల్‌ కాలేజీపై కూడా అదే రీతిలో కుట్రలు చేస్తున్నారు. కల్తీ మద్యం కేసు ఏమైందో ఇంతవరకూ స్పష్టత లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)