Breaking News

జగన్‌ను జనంలో తిరగనివ్వకూడదనే బాబు సర్కార్‌ టార్గెట్‌: వైఎస్సార్‌సీపీ

Published on Wed, 06/11/2025 - 19:04

సాక్షి, ఒంగోలు: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు కిరాయి మనుషులతో రాక్షసంగా వైఎస్‌ జగన్ కాన్వాయిపై రాళ్ళు రువ్వి, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాలని ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు.

జెడ్‌ప్లస్‌ కేటగిరి ఉన్న నాయకుడి పర్యటన సందర్భంగా కాన్వాయికి అతి సమీపంలోకి అరాచకశక్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ను ప్రజల్లోకి తిరగనివ్వకూడదనే ఏకైక ఎజెండాతో కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకానికైనా తెగబడుతోందని అన్నారు. ఎంతగా కవ్వించినా వైఎస్‌ జగన్, పార్టీ శ్రేణులు ధైర్యంగా రైతుల పక్షాన నిలబడ్డారని, పొగాకు కొనుగోళ్ళపై సర్కార్ అలసత్వాన్ని నిలదీశారని అన్నారు. ఇంకా వారు ఎమన్నారంటే.

పొగాకు రైతుకు భరోసా కల్పించారు: ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
మాజీ సీఎం వైఎస్‌ జగన్ పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వంను నిలదీశారు. రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందనే భరోసా కల్పించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు వైఎస్‌ జగన్. అందుకే ఆయన సీఎం అయిన తరువాత రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటుధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం తరుఫున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించారు.

పొగాకు రైతులకు అండగా ఉంటేందుకు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే, టీడీపీ మహిళలను అడ్డం పెట్టకుని ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. చెప్పులు, రాళ్ళు విసిరి అరాచకం సృష్టించేందుకు తెగబడ్డారు. రైతుల కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలనే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ రకంగా టీడీపీ కుట్రకు పాల్పడింది. ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్‌ తరువాత మహిళలకు అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడు వైఎస్‌ జగన్.

రాష్ట్రంలో ఆయన పాలనలో మహిళలకే అధికశాతం పథకాలను అమలు చేశారు. ఈ రోజు తన ర్యాలీలో కూడా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ మహిళలకు నమస్కారం చెస్తూ వెళ్ళిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్ వస్తున్నారనే విషయం, ఆయన పర్యటన గురించి ముందుగానే తెలిసి, ఆయన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా విఫలం చేయాలనే దుష్టతలంపుతోనే టీడీపీ ఈ రకంగా మహిళల ముసుగులో దిగజారుడు రాజకీయం చేసింది. పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి, రాళ్లు రువ్వడం ద్వారా భయాందోళనలకు గురి చేసిందని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.

మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో కుట్ర: మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
పొగాకు కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో మాజీ సీఎం, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు రేటు కల్పించాలని, ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే వైఎస్‌ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల నిరసనల పేరుతో రాళ్ళు రువ్వుతూ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ రాళ్ళ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఏదైనా నిరసనలు చేయాలంటే ప్రజాస్వామిక విధానాల్లో, శాంతియుత పద్దతుల్లో నిర్వహించాలే తప్ప ఈ రకంగా రైతుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత పర్యటనపై రాళ్ళ దాడి చేయడం దారుణం. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టి, ఇటువంటి అరాచకానికి  ప్రోత్సహించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయన పొదిలిలో ఎందుకు తిరిగాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలు సిగ్గుపడాలి: చుండూరి రవి
కిరాయి మనుషులతో తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ పర్యటనపై రాళ్ళు రువ్వించారు. ఒక మంచి సమస్యపై లక్షలాది మంది రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ జిల్లాకు వస్తే, దానిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్ముక్కు అవ్వడం వల్లే పొగాకు కు గిట్టుబాటు రేటు రావడం లేదు. ఇటువంటి దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తే సమాజంలో అరాచకం మరింత పెరుగుతుందని చుండూరి  రవి అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)