Breaking News

టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ ఫైర్

Published on Wed, 08/20/2025 - 21:17

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రవర్తన, వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. జాతీయ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల్లోనే టీడీపీ పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా తయారైంది. దీంతో ప్రభుత్వ విశ్వసనీయత, పాలన మీద తీవ్ర అనుమానాలు పెరుగుతున్నాయంటూ ఎక్స్‌ వేదిక  వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

‘‘అధికారుల మీద దాడి చేయడం నుంచి అవినీతి, పెరోల్ స్కాం, మహిళలపై అసభ్య ప్రవర్తన వరకు అనేక దారుణాలకు ఒడిగట్టారు. శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్యం మత్తులో అటవీ అధికారుల మీద దాడి చేశారు. వారి గస్తీ విధులను అడ్డుకున్నారు. గిరిజన సిబ్బందిని కూడా వేధించారు. ఈ ఘటనపై కనీసం అధికారులు కేసు కూడా నమోదు చేయలేదు. మంత్రి అచ్చెన్నాయుడు  వైఖరితో ఆగ్రోస్ జనరల్ మేనేజర్ మోహన్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డీలర్ల నుండి కమీషన్లు గుంజుకునే విషయంలో సహకరించలేదని ఆయన్ను వేధించి బదిలీ చేశారు.

..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఒక రౌడీషీటర్‌కి పెరోల్ సిఫార్సు చేశారు. దీనికి హోం మంత్రి అనిత కూడా పూర్తిగా సహకరించారు. వీరి చర్యలను చూస్తే ప్రజల భద్రత కంటే నేరస్తుల ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్‌లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించారు. ఆ విషయం బయట పెట్టిందని అనుమానించి మరో మహిళను వేధించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.

..అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను రాత్రిళ్లు ఆఫీస్‌కి పిలిపించడం, అర్థరాత్రి వీడియో కాల్స్ చేయడం వంటి వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఈ ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏస్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారులపై దాడులు, మహిళలపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలు రావడం సిగ్గుచేటు. టీడీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవాన్ని కాలరాస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కారు’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ నిలదీసింది.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)