Breaking News

వివాదాస్పద ఫ్లెక్సీలపై YSRCP ఫిర్యాదు

Published on Thu, 01/29/2026 - 19:00

సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు​ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్‌ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అరెస్ట్‌ చేశారు.

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్‌లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్‌లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)