Breaking News

రెడ్‌జోన్‌లో కూటమి 80 శాతం ఎమ్మెల్యేలు: ధర్మాన

Published on Sat, 12/13/2025 - 13:37

సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్‌ పాలన తర్వాత వైఎస్‌ జగన్‌ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.

మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు  ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి  సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.

1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్‌లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)