Breaking News

నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్‌, ఎంపీ: దేవినేని అవినాష్‌

Published on Thu, 10/16/2025 - 13:41

సాక్షి, ఎన్టీఆర్‌:  ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు దేవినేని అవినాష్‌. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్‌ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.  

జోగి రమేష్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్‌ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎ‍స్సార్‌సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.

Avinash: ఎల్లో గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం

పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)