Breaking News

‘లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే’

Published on Sun, 07/26/2026 - 16:14

కాకినాడ:  డీఎస్సీ స్కామ్‌పై  అన్ని ఆధారాలు చూపించామని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ ఒక్కటే సరైనదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని ఆధారాలతో సహా చూపించామని, అయినా ఇప్పటివరకూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదన్నారు. లోకేష్‌ గతంలో చాలెంజ్‌ విసిరితే తాము సిద్ధమయ్యామని, మీరు మాత్రం తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. 

యువత పోరాటానికి కూటమిలో బీజేపీ మంత్రి నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. మరి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలిన తర్వాత లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. లోకేష్‌ నైతిక బాధ్యత లేదా? అని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని కన్నాబాబు ప్రశ్నించారు.

డీఎస్సీలో స్కామ్‌ అనేది నిజం
విజయవాడ: డీఎస్సీలో పెద్ద స్కామ్‌ జరిగిందనేది వాస్తవమని, మెగా డీఎస్సీ కాదు.. ఇది దగా డీఎస్సీ అని యువతే అంటున్నారని ఎమ్మెల్యే కల్పలతరెడ్డి ధ్వజమెత్తారు. డీఎస్సీపై వచ్చింది ఆరోపణలు కాదని, నిజం అనే విషయం తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో డీఎస్సీ ఎగ్జామ్‌ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారని, అందుకోసం జీవోలు మార్చారని మండిపడ్డారు. 

నిజంగా డిఎస్పీ కోసం చదివిన అభ్యర్ధులు మాత్రం నష్టపోయారని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయడాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో పోస్ట్‌కి రూ. 15 లక్షలు అంటూ ఆడియోలు కూడా వచ్చాయని, ఇది వాస్తవం కాదా? అని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)