Breaking News

ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు: వైఎస్‌ జగన్‌

Published on Thu, 01/22/2026 - 12:43

తాడేపల్లి:  భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియదన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని విమర్శించారు వైఎస్‌ జగన్‌. ఈరోజు(గురువారం, జనవరి 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌..  చంద్రబాబు సర్వేలో అసలు సర్వే రాళ్లు లేవన్నారు. 

‘సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు. పాస్‌ బుక్‌ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతే.  ట్యాంపర్‌ చేయలేని పాస్‌బుక్‌లు ఇవ్వాలన్నదే మా తపన. పైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. 

కమీషన్లు తీసుకుని పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తున్నారు.  22ఏ గురించి బాబు మాట్లాడం ఆశ్చర్యమేస్తోంది. 22ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుది. 35లక్షల 40 వేల ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించాం.  27.40 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై రైతులకు హక్కులు కల్పించాం. చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాం. రూ. 55.79కు మేం పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఇస్తే.. చంద్రబాబు రూ. 76కు పాస్‌బుక్‌ ఇస్తున్నారు. 

బుద్ధి జ్ఞానం అయిన ఉండాలి... అబద్ధాలు చెప్పడానికి సిగ్గయినా ఉండాలి

మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్‌ వ్యవహారం. సర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్‌’ అని ధ్వజమెత్తారు వైఎస్‌ జగన్‌.

ఇవీ చదవండి:

వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌.. హైలైట్స్‌

చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)