Breaking News

అసెంబ్లీ సమావేశాల్లోనూ డైవర్షన్‌ రాజకీయాలేనా?!

Published on Mon, 11/11/2024 - 08:03

గుంటూరు, సాక్షి: ఏపీలో నేటి(నవంబర్‌ 11) నుంచి జరగనున్న అసెంబ్లీ ఫుల్‌ బడ్జెట్‌ సమావేశాలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. ఏకపక్షంగా సభను నిర్వహించుకుంటున్న కూటమి ప్రభుత్వం.. తమకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్‌సీపీకి 40% ఓటు షేర్‌ వచ్చింది. శాసనసభలో అధికార కూటమి, వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉంది. అయినా కూడా ప్రతిపక్షంగా గుర్తించి స్పీకర్‌ మైకు ఇవ్వడం లేదు. గత సమావేశాల్లోనూ ఇది జరిగింది. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు? అని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అన్నారు. 

అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రశ్నలు సంధించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులే తనకు స్పీకర్‌ లంటూ ఆయన వ్యాఖ్యానించారు కూడా.

రెండుసార్లు ఓటాన్‌!
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.

గత సమావేశాల్లో జరిగింది అదేగా..
సూపర్‌ సిక్స్‌ హామీలను అటకెక్కించే లక్ష్యంతో కనిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం..  బడ్జెట్‌ సమావేశాల వంకతో  డైవర్షన్‌ రాజకీయాన్ని కొనసాగించాలనుకుంటోంది. గత సమావేశాల్లోనూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలతో కాలయాపన చేసింది. శ్వేత పత్రాల పేరుతో హడావిడి చేసింది. ఇక ఇప్పుడు బడ్జెట్‌లోనూ కోతలు, కీలక హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డ్రామాను ప్రదర్శించే అవకాశం లేకపోలేదని అంచనా. 

బడ్జెట్‌ ఇలా.. 
నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి  సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. బడ్జెట్ అనంతరం శాసనసభ, మండలి వాయిదా పడనున్నాయి.

ఇదీ చదవండి: ఏపీలోనూ ‘కోటా’ తరహా ఘటనలు!!


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)