Breaking News

వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే దాడులు చేస్తారా?: భూమన

Published on Sun, 01/05/2025 - 11:13

సాక్షి, తిరుపతి: ఏపీలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దళితుల ఇళ్లపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయాడం అమానుషమని మండిపడ్డారు భూమన కరుణాకర్‌ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు. బాబు అధికారంలో ఉన్న ప్రతీసారీ ఇదే జరుగుతోందన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘నగరి మండలం తడుకుపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషం. చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులపై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదు’ అంటూ బాబు సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘తడుకుపేట దళితులపై దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టి కు తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయి. దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)