‘బాబూ.. ఇప్పుడు శ్రీవాణి ‍ట్రస్టు డబ్బులు మీ ఇంటికి వస్తున్నాయా?’

Published on Fri, 09/26/2025 - 13:55

సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పదిరూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. శ్రీవాణి ట్రస్టు విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారు.. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్‌ చేశారు.

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ, ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్‌ జగన్‌కు పనులు చేయడం మాత్రమే తెలుసు. దేశం అంతా దేవాలయాలు నిర్మాణం చేయాలని, ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పది రూపాయలు కూడా రాలేదు. వైఎస్ జగన్‌ పాలనలో శ్రీవాణి 2019 నుంచి ఇప్పటి వరకు 2038 కోట్లు జమ అయ్యాయి. అది జగన్ వల్లే జరిగింది.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశం అంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు. 3500 ఆలయాలు వైఎస్‌ జగన్‌ పాలనలో పూర్తి అయ్యాయి. అందులో 300 ఆలయాలు జీవోద్ధరణ చేయించారు. ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశ వ్యాప్తంగా లక్ష గుళ్లు నిర్మాణం జరిగి ఉండేది. మరి.. ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్ని చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా?. శ్రీనగర్‌, ముంబై, భువనేశ్వర్‌, విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేశాం.

నాడు శ్రీవాణి ట్రస్టుపై విషం చిమ్మారు.. ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు. చంద్రబాబు.. మీ మాదిరిగా వైఎస్‌ జగన్‌ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు. గుడి లోపల ఏఐ టెక్నాలజీ వాడటం ఆగమ శాస్త్రం విరుద్ధం. మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుడిని గ్రాఫిక్స్‌లో చూపించాలని చెప్పదలుచుకున్నారా?. వైఎస్‌ జగన్‌ చేసిన మంచిని అంగీకరించండి. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు.. ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్‌. నాయుడు.

Bhumana: తిరుమలలో చంద్రబాబు ఆయనను ఆయన పొగుడుకోవడమే సరిపోయింది

20 ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు. ఆయన బావగారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసుకొచ్చారు. బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్నా. దివంగత నేత వైఎస్సార్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు. బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారు అని ఘాటు విమర్శలు చేశారు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)