Breaking News

‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్‌.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’

Published on Fri, 12/12/2025 - 13:38

సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్‌ కార్పొరేటర్‌ రవిచంద్రను కిడ్నాప్‌ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.

మా పార్టీకి సంబంధం లేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్‌సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్‌సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

దెబ్బకు జ్వరం పుట్టించాం అధికారం ఉండి క్యాంపు రాజకీయాలు అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)