Breaking News

బాబూ.. హజ్‌ యాత్ర పాయింట్‌ తొలగింపు సరికాదు: అంజాద్‌ భాషా

Published on Thu, 03/20/2025 - 13:49

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా. విజయవాడ నుంచి హజ్‌ యాత్ర పాయింట్‌ తొలగించడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్‌ సాధించినట్టు తెలిపారు.

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నుంచి హజ్‌ యాత్ర పాయింట్‌ తొలగించడం సరికాదు. వైఎస్సార్‌సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్‌ సాధించాం. మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పాయింట్‌ తొలగించారు. గతంలో మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలంటే వేరే ప్రాంతాల నుండి వెళ్ళేవారు. 2019లో కూడా హైదరాబాద్‌ పాయింట్ నుండి హాజీలు యాత్రకు వెళ్లారు.

అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దీంతో, 2020లో మన రాష్ట్రం విజయవాడ నుండి యాత్రకు పాయింట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదు. 2022లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది. 2023లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది.

2023లో మన రాష్ట్రం నుండి విజయవాడ వద్ద పాయింట్ నుంచే 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇంత కష్టపడి సాధించిన యాత్ర పాయింట్‌ను తీసేయడం బాధాకరం. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగింపు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)