Breaking News

బాబూ.. ఇది టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టే: అంబటి రాంబాబు

Published on Mon, 10/07/2024 - 16:39

సాక్షి, గుంటూరు: అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా?.. చంద్రబాబు ఒక దుర్మార్గమైన సంప్రదాయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అలాగే, కేసులు మాఫీ చేసుకోవడానికేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్‌ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతోందని చెప్పుకొచ్చారు. 

మాజీ మంత్రి అంబటి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంగళ్లులో పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పచ్చ నేతలు దాడులు చేశారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని అబద్ధాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్‌ చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి మీ మీద ఉన్న కేసులన్నీ క్లోజ్‌ చేసుకుంటారా?.

చంద్రబాబు అధికారంలో అన్నీ సిండికేట్లే. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని సిండికేట్‌ చేసింది. ఎల్లో మీడియాను సిండికేట్‌ చేసి వాళ్లకు సంపద సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. నాణ్యమైన మద్యం దొరకడం లేదని చంద్రబాబు ప్రచారం చేశారు. నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో​ రానున్న రోజుల్లో చూస్తాం. మద్యం దుకాణానికి రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. నేడు విచ్చలవిడిగా మద్యం అమ్ముకునేందుకు తలుపులు తెరిచారు. రూ.30లక్షలు కట్టకపోతే షాపులు దక్కనివ్వబోమని బెదిరిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలను మళ్లీ తెరమీదకి తెస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడమే మంచి ప్రభుత్వమా?. సిండికేటుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారు. మద్యం షాపులు నడపాలని ముందుకొచ్చే వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. 961 షాపులకు నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్‌ కూడా రాలేదు. దరఖాస్తులు పెట్టుకోవాలంటే టీడీపీ ఎమ్మెల్యేలకు జనం భయపడుతున్నారు. ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టించే కార్యక్రమం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేశాడు. రాష్ట్రంలో ప్రస్తుతానికి అసలు ఇసుకే దొరకడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో కంటే ఇప్పుడే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. టీడీపీ నేతలే సిండికేట్‌గా ఏర్పడి ఇసుకను దోచేస్తున్నారు’ అంటూ విమర్మించారు. 

ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్‌!: వైఎస్సార్‌సీపీ
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)