‘నాదెండ్ల వాస్తవాలు తెలుసుకో.. పీడీఎస్ బియ్యం మంత్రి వియ్యంకుడిదే’

Published on Mon, 12/02/2024 - 17:49

సాక్షి, గుంటూరు: కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్‌ వియ్యంకుడిదే.. మంత్రి నాదెండ్ల మనోహార్‌ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సీజ్‌ చేసిన షిప్‌నే మళ్లీ సీజ్‌ చేయడమేంటి?. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్‌ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్‌ బియ్యం తరలివెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు.

అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు హాయాంలోనే అక్రమాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్‌, నాదెండ్ల మనోహర్‌ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. చెక్‌పోస్టులు ఉండగా.. పీడీఎస్‌ బియ్యం ఎలా తరలిపోతుంది?. అధికారం పవన్‌ కల్యాణ్‌ చేతిలోనే ఉంది కదా?. వైఎస్‌ జగన్‌పై బురద జల్లడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్‌ వియ్యంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహార్‌ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా బియ్యం తరలి వెళ్తోంది. జనసేనకు చెందిన వారంతా పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారు. జనసేన నేతలు కుమ్మకైపోయి అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. 

Ambati Rambabu: సీజ్ చేసిన షిప్ నే మల్లి సీజ్
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)