Breaking News

కాంగ్రెస్‌లో చేరిన షర్మిల

Published on Thu, 01/04/2024 - 11:42

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. న్యూఢిల్లీలోని AICC కార్యాలయానికి భర్త అనిల్‌తో వచ్చిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. 

షర్మిల ఏమన్నారంటే..

  • వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉంది
  • ఈరోజు నుంచి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ ఒక భాగం
  • దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్
  • దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్
  • కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదు
  • రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల
  • కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా 
  • రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
  • ఆ యాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
  • రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు నాలో కూడా విశ్వాసం నింపింది 
  • సెక్యులర్ పార్టీ కేంద్రంలో లేనందువల్లే మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి
  • దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే
  • కాంగ్రెస్‌లో చేరినందుకు గర్వపడుతున్నాను.

ఇక, వైఎస్సార్‌టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. ఈరోజు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు హాజరయ్యారు.

AICC కార్యాలయంలో చేరిక అనంతరం సోనియా నివాసానికి వెళ్లారు షర్మిల, అనిల్‌. సోనియాను కలిసి పార్టీలో స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేయమని సోనియా చెప్పారని, దేశమంతా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం పని చేస్తానని, మీడియా అడిగే అన్ని ప్రశ్నలకు ఒకటి రెండు రోజుల్లో అన్నిటికీ సమాధానం చెప్తానని, కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)