Breaking News

సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ప్లాప్‌ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు: వైఎస్‌ జగన్‌

Published on Wed, 09/10/2025 - 13:23

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్‌ సిక్స్‌.. అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.  సూపర్‌ సిక్స్‌ అనే.. అట్టర్‌ ఫ్లాప్‌ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్‌లో ఇవాళ ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్‌ వ్యాఖ్యలు చేశారు.

సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ప్లాప్‌ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్‌.. ఇది ఏ లెవల్‌ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్‌టైజ్‌మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్‌ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్‌సిక్స్‌లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

సూపర్‌ సిక్స్‌కు పొంతనేది..
ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌కు ఈరోజు సూపర్‌ సిక్స్‌ పొంతన లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ ధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రతీ మహిళకు 36వేలు ఇచ్చారా?.

నిరుద్యోగ భృతి కింద రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు బాకీ పడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు గతేడాది 48వేలు, ఈ ఏడాది 48 వేలు పెన్షన్లకు ఎగనామం పెట్టారు. మేము దిగిపోయే నాటికి 66,34,742 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. ఇప్పుడు 61,91,864 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. ఇది మోసం కాదా? చంద్రబాబు అని అడుగుతున్నాను. పీఎం కిసాన్‌ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామన్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రైతులకు రూ.40వేలు బాకీపడ్డారు. తల్లికివందనం కింద 15వేలు ఇస్తామన్నారు. రూ.8వేలు, 9వేలు, 13వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.

బాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్‌పై జగన్ అదిరిపోయే సెటైర్లు

ఉచితం పేరిట.. 
ఇసుక దోపిడీ నడుస్తోంది. లిక్కర్‌ మాఫియా నడుస్తోంది. అమరావతి పేరిట మాపియా జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్‌ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్‌ వాయిస్తున్నారు. సూపర్‌సిక్స్‌ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం ఇది. చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి అని చెప్పుకొచ్చారు. 

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)