Breaking News

రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?: వైఎస్‌ జగన్‌

Published on Wed, 03/05/2025 - 13:23

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు  చేసిన రూలింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని.. అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. 

తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ఇంతమంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం అని ఎక్కడా రూల్‌ లేదు. ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. 

గతంలో చంద్రబాబు(Chandrababu) అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా.

ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం. ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు.. ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్‌ కట్‌ చేస్తామంటే అంటే ఎలా?. లీడర్‌ ఆఫ్‌ ద హౌజ్‌కు ఎంతసేపు  మైక్‌ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టే మీ ద్వారా(మీడియా) ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.



మీరే అధికారంలో ఉండి..మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా?. రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?. ఇదేమైనా డబుల్‌ యాక్షనా.. ఇదేమన్నా సినిమానా? అని జగన్‌ అన్నారు. 

జనసేన ఉండగా.. వైఎస్సార్‌సీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ఆయన జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’’ అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)