Breaking News

వైఎస్‌ జగన్‌ నోట పుష్ప ‘రప్పా.. రప్పా’ డైలాగ్‌

Published on Thu, 06/19/2025 - 13:54

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుష్ప 2 సినిమాలో బాగా ఫేమస్‌ అయిన ‘రప్పా.. రప్పా’ డైలాగ్‌ కొట్టారు. కూటమి అరాచక పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ఆయన.. తాజా రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని ఆ డైలాగ్‌ పోస్టర్‌ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు.

ఆ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. పోస్టర్‌లో వైఎస్‌ జగన్‌ ఫొటో కూడా ఉండటంతో అది కాస్తా ట్రెండ్‌లోకి వచ్చింది. ఈ పోస్టర్‌ వివాదాస్పదంగా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం ప్రెస్‌మీట్‌లో విలేకర్లు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 

వైఎస్ జగన్ నోట అల్లు అర్జున్ పుష్ప డైలాగ్

గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని వైఎస్‌ జగన్‌ తొలుత డైలాగ్‌ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని జగన్‌ ప్రశ్నించారు.

అయితే 2029లో వైఎస్సార్‌సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుంతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డ్‌ ప్రదర్శించిన వ్యక్తి పక్కా టీడీపీ మనిషి అని తేలింది. గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ను ముగించారు. 

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)