Breaking News

‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ

Published on Thu, 07/16/2026 - 16:11

సాక్షి, తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు కోసం యాప్‌ డిజైన్‌ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్‌లో ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నుంచి ఇవాళ అధికారిక ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ను ఆవిష్కరిస్తున్నామన్నారు.

‘‘ఈ రోజు ఏం జరుగుతోంది అంటే.. సోషల్‌ మీడియాలో మన వాళ్లు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్‌ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్‌ తీసుకొచ్చి ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేస్తున్నాం. అదే జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు.

..అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్‌ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్‌ చేసే హక్కు కూడా వారికి ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చు.’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్‌ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే అవకాశం ఉంటుంది.

జగన్ 2.0 SUPER APP లాంచ్

👉 Click here to download the Jagan 2.0 Super App.

ఈ యాప్‌లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్‌మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్‌ ఫీడ్‌ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్‌లో పోస్ట్‌ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త  ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది.

..పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్‌ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్‌తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్‌లో ఆ డిజిటల్‌ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్‌ ద్వారా డిజిటల్‌ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు.

..ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్‌యాప్‌ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్‌ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)