Breaking News

బీఆర్‌ నాయుడు, జనసేన శ్రీధర్‌పై చర్యలేవి?: వైఎస్‌ జగన్‌

Published on Wed, 03/11/2026 - 13:14

సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్‌ తీస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్య‌లేవి? అని నిల‌దీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్‌పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.

లిస్ట్‌ ఇదే.. 

  • రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?
  • KGBV మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?
  • మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌మీద  ఏం చర్యలు తీసుకున్నారు?
  • టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?
  • మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే  తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.
  • ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.
  • తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.

దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్‌ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్‌ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. 

బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. 
రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్‌, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లీనిక్‌లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్‌ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.

లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్‌ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్‌ఐ, పాస్‌బుక్‌ క్యూఆర్‌ కోడ్‌ భూమలు జియో ట్యాగింగ్‌ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్‌ అసిస్టెంట్‌ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)