‘చంద్రబాబూ.. ఇక జగన్నామ స్మరణ ఆపేయ్‌’

Published on Fri, 09/13/2024 - 16:45

కాకినాడ, సాక్షి: అబద్ధపు ప్రచారాల్లో చంద్రబాబు గోబెల్స్‌కి తమ్ముడి వరుస. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్‌ చేయడంలో దిట్ట. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉంది అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏలేరు వరద ముంపు బాధిత గ్రామాల్లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజలను ఇబ్బంది చేయడమే కాకుండా చంద్రబాబు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో వచ్చి ఇన్నిరోజులు గడిచినా.. తాను చేయాల్సిన పనులేవీ చేయలేదు. దానంతటికి కారణం జగనే అంటారు. ఎక్కడ ఏం జరిగినా.. జగన్‌ పేరే చెప్తారు..

.. చంద్రబాబూ.. ఇకనైనా జగన్నామం ఆపు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచింది. చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో. ప్రజలకు న్యాయంగా, ధర్మంగా ఇవ్వాల్సిన దాని మీద ధ్యాస పెట్టు అని చంద్రబాబుకి జగన్‌ హితవు పలికారు. చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారాలకుఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి ఎల్లో మీడియా తోడైయ్యింది’’ అని జగన్‌ పేర్కొన్నారు. 

ఈ నాలుగు నెలల్లో..
ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థనలనూ నాశనం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేయడం లేదు. పంటల బీమా ప్రీమియమ్‌ కూడా కట్టడం లేదు. వ్యవసాయ సీజన్‌ మొదలైంది. వారికి అందాల్సిన సున్నా వడ్డీ పంట రుణాలు ఏమయ్యాయి?.  పెట్టుబడి సాయం రైతు భరోసా ఏమైంది? రూ.20 వేలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

ఇదీ చదవండి: చిల్లర రాజకీయమే చంద్రబాబు ముందున్న మార్గమా?

గత మా ప్రభుత్వంలో.. 
రైతులకు పంట నష్టం జరిగితే, గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఆర్బీకేలు ఉండేవి. ఇన్సూరెన్స్‌ ఉండేది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఉండేది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. గతంలో రైతులకు ఎంత వచ్చేది? ఒక్కసారి ఆలోచించండి.

జగన్‌ ఇప్పుడు ఉండి ఉంటే.. 
ఇప్పుడే కనుక జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది. సీజన్‌ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లం. గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో అది కేవలం రూ.15 వేలు మాత్రమే. ప్రీమియం కట్టి ఉండే వాళ్లం కాబట్టి రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు బీమా పరిహారం వచ్చేది. దాంతో పాటు, పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ కింద దాదాపు రూ.5 వేల వరకు.. అన్నీ కలిపి రైతులకు ప్రతి ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అంది ఉండేది.

కానీ, ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) ఏం చెబుతున్నారు?. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నారు. ఎలా? ఈ–క్రాపింగ్‌ లేదు.. అడిటింగ్‌ లేదు. ఆర్బీకే వ్యవస్థ లేదు. ఇంకా ఇన్సూరెన్స్‌ గురించి చెప్పడం లేదు. బాబు హయాంలో కేవలం రూ. 3 వేల కోట్లే వచ్చింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,250 కోట్లు చెల్లించకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఇన్సూరెన్స్‌ చెల్లించలేదు.  భరోసా గురించి నోరు మెదపరు. ఇన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా.. చంద్రబాబు మాత్రం నిజం మాట్లాడరు.

చంద్రన్న మార్క్‌ మోసం
చంద్రన్న వస్తే రూ.20 వేల ఇస్తానని మోసం చేశారు. రూ.15 వేలు ఇస్తానని బడి పిల్లలను మోసం చేశారు. రూ. 18వేలు ఇస్తానని అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. ఏడాదికి రూ. 36 వేల నిరుద్యోగ భృతి అని మోసం చేశారు. రూ. 2 వేలకోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు. విద్యాదీవెన, గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. లా అండ్‌ఆర్డర్‌ గాలికొదిలేశారు. బాధితులపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. వరద బాధితులకు కనీసం పునరావాసం కూడా కల్పించడం లేదు. 

వ్యవస్థలన్నీ అతలాకుతలం
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతీ ఒక్కటీ డోర్‌ డెలివరీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఏది కావాలన్నా.. టీడీపీ నాయకులనే అడగాలి. ఆ నాయకులు ఇళ్లలోనే సచివాలయ సిబ్బంది పెన్షన్‌ పంచుతున్నారు. ఎవరైనా అలా వెళ్లి పెన్షన్‌ తీసుకోకపోతే, కట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పాలన గాలికి ఎగిరిపోయింది.  రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.

ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
చంద్రబాబు హయాంలో ఎవరూ తమ బాధ్యతలు నిర్వర్తించరు. ఇలాంటి దారుణ పాలన పోవాలి. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, మోసాల కింద మారుతున్నాయి. ప్రజలకు కోపం వస్తోంది. వారు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయి. అది జరగకూడదని రెడ్‌బుక్‌ పాలన చేస్తున్నారు. అయినా ఏం చేయలేరు. ప్రజలు ఇంకా భరించే పరిస్థితి లేదు.

ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలకు స్పందించడం లేదు. చంద్రబాబు ఎంతసేపూ డ్రామాలు చేస్తున్నారు. ఫొటోలకు ఫోజులు ఇస్తూ షోలు చేస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌ సినిమా ఆర్టిస్ట్‌. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్‌. పవన్‌ కంటే బాబు బాగా నటిస్తున్నాడు. పవన్‌కు పెద్దగా ఏం తెలియడం లేదు’’ అని జగన్‌ అన్నారు. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)