Breaking News

వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

Published on Sun, 11/30/2025 - 19:44

సాక్షి, తాడేపల్లి: పార్లమెంటు సమావేశాలు రేపటి(డిసెంబర్‌ 1, సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. తుపానులతో రైతులు నష్టపోయిన తీరు. పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు.

‘‘రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలి. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయటంపై మాట్లాడాలి. బీమా లేకపోవడంతో రైతులు నష్టపోవటం, ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించని వైనాన్ని సభలో చర్చించాలి. ఈ-క్రాప్ విధానం అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకు వెళ్లాలి. మామిడి రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించని వైనంపై మాట్లాడాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలి

..18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంటులో నిలదీయాలి. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలాగ ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంపై చర్చించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌‌లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవటం.. మౌలిక సదుపాయాలను కల్పించని వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలి. ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి’’ అని వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)