Breaking News

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది

Published on Sat, 07/04/2026 - 10:42

సాక్షి, వైఎస్సార్‌: కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

2019లోనే కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్) సంస్థను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒప్పించిందని అవినాష్‌ రెడ్డి అన్నారు. 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణ కూడా పూర్తిగా జగన్‌ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు కోసం 1100 ఎకరాల భూకేటాయింపు కూడా ఫేజ్–1లోనే చేపట్టినట్లు వివరించారు.

2023 ఫిబ్రవరిలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని అవినాష్‌ రెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని క్లియరెన్సులు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ సంస్థ అధినేత జిందాల్‌ స్వయంగా వెల్లడించారాన్నారు. 

కడప సభలో ఈ ప్రాజెక్టుపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్‌ అవినాష్‌ తప్పుబట్టారు.“ఫ్యాక్టరీని తానే తెచ్చానని చెప్పుకుంటూ క్రెడిట్‌ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శించారు. సభ స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం కాకుండా.. కేవలం వైఎస్‌ జగన్‌ను దూషించడానికే పెట్టినట్లు ఉందని అన్నారు.

అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాజెక్టుపై కూడా అవినాష్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా అంగీకరించారని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అమరావతి కోసం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ మాత్రం మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే “మావిగన్‌” వంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించారని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)