Breaking News

తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Published on Sun, 12/21/2025 - 12:58

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వాటర్‌ గ్రిడ్‌ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్‌ జగన్‌ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్‌ తీరును ఎండగట్టారు.

‘‘గూగుల్‌ డేటా సెంటర్‌ నుంచి అన్నింటిలో క్రెడిట్‌ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్‌ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్‌ చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్‌ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేశాడు

..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్‌ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్‌ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు.

..ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్‌. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ.

..విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్‌ చోరీకి పాల్పడాలని అర్నాబ్‌ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్‌రెడ్డి హెచ్చరించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)