Breaking News

కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 08/20/2023 - 20:09

భోపాల్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తనవైన రాజకీయాలకు తెరతీశారు. సాట్నాలో ఓ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఢిల్లీ సీఎం INDIA కూటమిలో భాగస్వామిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో తమకు అవకాశమిస్తే INDIA కూటమిలో తమ భాగస్వామి కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా మర్చిపోతారని అన్నారు. 

మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అప్పుడే ఎన్నికలకు శంఖారావాన్ని పూరించాయి. ఇదిలా ఉండగా మేమేమీ తక్కువ తినలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 

మధ్యప్రదేశ్‌లోని సాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమను మరో 50 ఏళ్ల వరకు ఏ పార్టీ కదపలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒకసారి అవకాశమిచ్చి చూడండి..  కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్ప పరిపాలన అందిస్తామని అన్నారు.

కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తుంది.. బీజేపీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది..  మాకు విమర్శించడం తెలియదు. జాతిని నిర్మించడం ఒక్కటే మా ప్రధాన లక్ష్యం. జాతి నిర్మాణం కోసమే మేము అన్నా ఆందోళన నుండి విడిపోయామని అన్నారు. 

ఇన్‌కమ్‌ టాక్స్‌ కమీషనర్‍గా పని చేస్తోన్న నేను జాతిని నిర్మించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానని అన్నారు. మేము రాజకీయ నాయకులం కాదు. జాతి నిర్మాణమే మా ప్రధాన ఎజెండా. మధ్యప్రదేశ్‌లో మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయేలా పరిపాలిస్తామని అన్నారు.            

ఇది కూడా చదవండి: ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)