Breaking News

పులివెందులలో.. ఆ 10 మంది టీడీపీ వాళ్లే!

Published on Tue, 08/12/2025 - 10:52

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ప్రజలు ముక్కున వేలేసుకునేలా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటూ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు.. పోలింగ్‌ వేళ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులపై దాడులు చేయడం మొదలు.. ప్రచారాలను అడ్డుకోవడం.. దాడులు చేయడం, పోలింగ్‌ బూత్‌లను మార్పించడం, పోలీసుల సాయంతో అక్రమ కేసులు.. నిర్బంధాలు, చివరకు ఇవాళ పోలింగ్‌ వేళ ఓటర్లను భయపెట్టడం.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం టీడీపీకి షరా మామూలే అనే విషయాన్ని స్పష్టం చేశాయి.

పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ వేళ టీడీపీ అరాచకాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ నేతలు, కొన్నిచోట్ల ఓటర్లను అడ్డుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లను వెనక్కి పంపేసి మరీ ఓట్లు వేసుకుంటున్నారు. టీడీపీ మూకలు రిగ్గింగ్‌ చేస్తున్నా.. ఎన్నికల అధికారులు, పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్న చందాన ఉండిపోయారు. ఈ అరాచకాలను కప్పి పుచ్చేందుకు ఎల్లో మీడియా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.

పులివెందుల, ఒంటిమిట్టలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఈ ఉదయం నుంచి కథనాలతో ఊదరగొడుతోంది. ఈ క్రమంలో పోలింగ్‌ బూత్‌ల వద్దకు కేవలం కూటమి పార్టీల అనుకూల మీడియాలను(ఆఖరికి చిన్నాచితకా యూట్యూబ్‌ ఛానెల్స్‌ను సైతం) పోలీసులు అనుమతిసున్నారు. అలాగే.. ఎలక్షన్‌ ప్రశాంతంగా జరుగుతోందంటూ కవరేజ్‌తోనూ భలే కవరింగ్‌ చేస్తున్నారు. 

ఓ పది మంది టీడీపీ అనుకూల వ్యక్తులను క్యూ లైన్‌లో నిలబెట్టి వీడియోలు తీసి బయటకు వదులుతున్నారు. తద్వారా.. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతులో, ఎంతో సక్రమంగా జరుగుతోందంటూ ఎల్లో మీడియా ద్వారానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంటెంట్‌నే అటు టీడీపీ అండ్‌ కో సోషల్‌ మీడియాలోనూ ప్రమోట్‌ చేసుకుంటోంది. 

మరోవైపు.. పోలీసుల సాయంతోనే టీడీపీ పలుచోట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతోంది.  తమకు కావాల్సిన ఓట్లన్నీ టీడీపీ గుద్దించుకున్నాక.. ఆపై ఊళ్లలోకి వచ్చి ఓటేయడానికి రావాలంటూ అభ్యర్థులను, కొందరు ఓటర్లను పోలీసులు బతిమాలుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహిస్తున్న ఓటర్ల నుంచి పోలీసులు చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఇంకోపక్క.. పులివెందుల, ఒంటిమిట్టలోని పలు గ్రామాలకు చెక్‌ పోస్టులు వెలిశాయి. వాటి గుండా ఓటర్లతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎంట్రీ ఇవ్వడం లేదు పోలీసులు. కేవలం టీడీపీ నేతల కార్లు కనిపిస్తే చాలూ రైట్‌ రైట్‌ చెబుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)