Breaking News

నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?

Published on Mon, 05/06/2024 - 06:30

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు. చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.

👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్  కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు... ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.


👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు...


👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక  మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం  జేజెమ్మ గుర్తొస్తుంది ..

:::సిమ్మాదిరప్పన్న

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)